MS Dhoni: ధోనీ స్టంపింగ్ చేస్తే ఎంపైర్ నిర్ణయంతో పనిలేదు
HBD MS Dhoni: ఈ రోజు మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కెప్టెన్ కూల్ ధోనీకి సెలబ్రీటీల నుంచి డైహార్డ్ ఫ్యాన్స్ వరకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్‌లో ఒక ఫ్యాన్ షేర్ చేసిన యానిమేషన్ వీడియో చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది.
Happy BirthDay MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీని ( Mahendra Singh Dhoni ) కెప్టెన్ కూల్ అంటారు. కూల్‌గా టీమ్ ఇండియాను నెంబర్ వన్ ( Team India ) స్థానానికి తీసుకొచ్చాడు. ధోని ఎలాంటి ఉద్రేకాలకు లోనవ్వకుండా వరుస విజయాలతో దూసుకెళ్లాడు .ఈ రోజు మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కెప్టెన్ కూల్ ధోనీకి సెలబ్రీటీల నుంచి డైహార్డ్ ఫ్యాన్స్ వరకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్‌లో ఒక ఫ్యాన్ షేర్ చేసిన యానిమేషన్ వీడియో చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. రవీంద్ర జడేజా ఇందులో బౌలింగ్ చేయగా వరుసగా ధోనీ స్టంపింగ్‌లు చేస్తాడు. అయినా బ్యాట్స్‌మెన్ నిలబడి అంపైర్ వైపు చూస్తుంటాడు. Read Also : Virat Kohli: విరాట్ కోహ్లీ మాత్రమే సచిన్ రికార్డులను బ్రేక్ చేయగలడు
అది గమనించిన అంపైర్...అరే నిల్చుని ఏం చేస్తున్నావు. ధోనీ ఔట్ అంటే.. దానర్థం ఔట్ అని. మా థర్ట్ ఎంపైర్ కూడా అతని దగ్గరికి ట్యూషన్ తీసుకోవడానికి వెళ్తాడు. అలాంటిది నువ్వు ధోనీ అప్పీల్‌నే ( Dhoni’s Appeal ) సందేహిస్తున్నావా.. వెళ్లు..ఇంటికి వెళ్లి బిర్యానీ తిను అంటాడు.
ఈ వీడియో సరదాగా అనిపించినా.. ఇందులో ఒక నిజం కూడా ఉంది. ధోనీ వికెట్ కీపింగ్ ( MS Dhoni Wicket Keeping ) చేసే సమయంలో ఎంత మంచి బ్యాట్స్‌మెన్‌కు అయినా కాస్త కంగారుగా ఉంటుంది. ఎందుకంటే మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్ చేసేస్తాడు.2016 లో ఆస్ట్రేలియాతో ( India Vs Australia 2016 ) జరిగిన వన్డేలో జార్జ్ బెయిలీ వికెట్‌ను కేవలం 0.08 సెకన్లలోనే స్టంప్ ఔట్ చేశాడు. ఇదే ఇప్పటి వరకు ఉన్న అత్యంత పాస్టెస్ట్ స్టంపింగ్ ( Fastest Stumping by MS Dhoni ) అదే. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..